నా భర్త నాకు కావాలి

12 Nov, 2016 00:03 IST|Sakshi
నా భర్త నాకు కావాలి

వనస్థలిపురం: తనను ఇక్కడే వదిలేసి అమెరికా చెక్కేసిన ఎన్‌ఆర్‌ఐ భర్త ఇంటి ఎదుట ఓ మహిళ ఆందోళనకు దిగింది. కోడలు వస్తున్న విషయం ముందే గ్రహించిన అత్తా, మామలు ఇంటికి తాళం వేసుకుని ఉడారుుంచారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా తంగడవల్లికి చెందిన ఆర్‌టీసీ ఉద్యోగి దేశగోని వెంకటేష్ కుమార్తె శ్రీలతను వనస్థలిపురం వైదేహినగర్‌కు చెందిన గంగపురం సత్యనారాయణ కుమారుడు మధుకర్‌కు ఇచ్చి 2014లో వివాహం జరిపిం చారు. మధుకర్ యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పెళ్లరుున తర్వాత భార్య శ్రీలతను కూడా తనతోపాటు తీసుకెళ్లాడు.

తొమ్మిది నెలల క్రితం భార్యా, బిడ్డలతో కలిసి ఇండియాకు వచ్చిన మధుకర్ వారిని పుట్టింటిలో వదిలి ఏడు నెలల క్రితం యూఎస్ తిరిగి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కాంటాక్టులో లేడని, ఫోన్ చేసినా ఎత్తడం లేదని శ్రీలత తెలిపింది. అత్తా, మామలను సంప్రదించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చేసేది లేక శుక్రవారం పెద్దమనుషులను తీసుకుని అత్తారింటికి రాగా, అప్పటికే అత్తా, మామ తాళం వేసుకుని పరారు కావడంతో వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు..
పెళ్లి సమయంలో ఇచ్చిన ఎకరం భూమిని తన పేరున మార్పించాలని మధుకర్ కొంతకాలంగా వేధిస్తున్నాడని  శ్రీలత, ఆమె తండ్రి వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే మధుకర్ తన పేరున ఉన్న ఆస్తి మొత్తం ఆయన అక్క పేరున మార్పించినట్లు తెలిపారు. భూమిని తన కూతురు, మనవరాలి పేరిట చేరుుంచడానికి సిద్ధంగా ఉన్నానని, తన కూతురికి న్యాయం చేయాలని కోరారు.

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మద్ధతు...
విషయం తెలుసుకున్న సిటిజెన్‌‌స ఫస్ట్ హ్యూమన్‌రైట్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి జగదీశ్వరి, హైదరాబాద్ అధ్యక్షురాలు చీల రోజా రమణి, నాగోలు అధ్యక్షురాలు రంగేశ్వరి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని శ్రీలతకు మద్ధతుగా నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి శ్రీలతకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

మరిన్ని వార్తలు