నేటి నుంచి హైదరాబాద్ లో ఎగ్జిబిషన్

1 Jan, 2016 06:52 IST|Sakshi

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలకు విస్తృత స్థాయిలో మార్కెటింగ్‌ కల్పించే ఉద్దేశంతో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన - 2016 నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ డైరక్టర్ శైలజా రామయ్యర్ వెల్లడించారు. శుక్రవారం ఎన్‌టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన జనవరి 18వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.

జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్లో శైలజా విలేకరులతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి 68 చేనేత సహకార సంఘాలు, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల హ్యాండ్లూమ్ సొసైటీలు రూపొందించిన వందకు పైగా వైవిధ్యమైన చేనేత ఉత్పత్తులను ఈ వస్త్ర ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

త ఏడాది జనవరిలో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన ద్వారా రూ. రెండు కోట్ల మేర లావాదేవీలు నిర్వహించామని.. అదే ఈ ఏడాది రూ.2.50 కోట్ల మేర అమ్మకాలు జరిగే అవకాశం వుందని శైలజా రామయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో నాలుగు ప్రత్యేక చేనేత ప్రదర్శనలు, జిల్లా స్థాయిలో పది వస్త్ర ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారైన అధునాతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను ఒకే వేదికపై అందుబాటులోకి తేవడమే జాతీయ వస్త్ర ప్రదర్శన ప్రధాన ఉద్దేశమన్నారు. గతంలో చేనేతతో పాటు ఇతర ఉత్పత్తులు కూడా ప్రదర్శించారని.. కాగా ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కేవలం చేనేత మగ్గాలపై తయారైన వాటినే మాత్రమే ఈ ప్రదర్శనకు అనుమతిస్తామన్నారు.

మరిన్ని వార్తలు