అసమానతల నిర్మూలనకు ఆర్థిక సర్వే తోడ్పాటు

28 Oct, 2016 02:36 IST|Sakshi
నిపుణుల కమిటీ సమావేశంలో నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ కమిషన్‌ చైర్మన్‌ బర్మన్‌
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్మూలించేందుకు సామాజిక ఆర్థిక సర్వే ఎంతగానో దోహదపడుతుందని జాతీయ గణాంక సంఘం (నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ కమిషన్‌) చైర్మన్‌ రాధా బినోద్‌ బర్మన్‌ అన్నారు.75వ విడత సర్వే బాధ్యతలను నేషనల్‌ శాంపిల్‌సర్వే విభాగానికి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ అప్పగించిందని చెప్పారు.

2017 జూలై నుంచి ప్రారంభం కానున్న సర్వే  సన్నాహాల కోసం నిపుణుల కమిటీ గురువారం సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌స్టడీస్‌లో సమావేశం కాగా, సర్వేలోని అంశాలపై ఎస్‌ఎస్‌ఈ చైర్మన్‌ బర్మన్‌ మాట్లాడారు.  2030 నాటికి పేదరికం, నిరక్షరాస్యత, లింగవివక్ష.. తదితర సమస్యలను పూర్తిగా రూపుమాపాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యాలను నిర్దేశించినందున, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు ఈ సర్వే ఉపయోగపడనుందన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రాధాకృష్ణ మాట్లాడుతూ..  సర్వే  వచ్చే ఏడాది జూలై నుంచి 2018 జూన్‌ వరకు జరుగుతుందన్నారు. త్వరలోనే పైలట్‌ సర్వేను నిర్వహిస్తామన్నారు. 
మరిన్ని వార్తలు