నయీమ్ కబ్జా ప్లాట్లు చదును చేసిన రియల్టర్

21 Sep, 2016 03:17 IST|Sakshi

ఘట్‌కేసర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కబ్జాలో ఉన్న ప్లాట్లను ఓ రియల్టర్ చదును చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కొద్దిసేపటికే వదిలేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుశాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రకాష్ కథనం ప్రకారం.. గ్రామంలోని సర్వేనంబర్ 14లో ఉన్న పొలం గ్రామానికి చెందిన ఉదారి నాగభూషణం పేరు మీద ఉంది. ఆయన వద్ద కుషారుుగూడకు చెందిన బాపురెడ్డి కొన్నేళ్ల క్రితం జీపీఏ చేసుకున్నాడు. దీంతో పాటు సర్వేనంబర్ 10లో మరికొంత భూమికి సైతం జీపీఏ తీసుకొని 1988లో మొత్తం 14 ఎకరాలతో ఆయన వెంచర్ వేసి, ప్లాట్లను అమ్మేశాడు.

అనంతరం గ్రామపెద్దల సహకారంతో రెండోసారి అవే సర్వేనంబర్లలోని 14 ఎకరాల్లో 2004లో వెంచర్ వేశారు. అందులోని 51 ప్లాట్లను నగరానికి చెందిన రియల్టర్ సురేందర్‌రెడ్డి రెండోసారి తక్కువ ధరకు కొన్నాడు. ఈ క్రమంలో నయీమ్ కొంత డబ్బివ్వాలని సురేందర్‌రెడ్డికి హుకుం జారీ చేశాడు. దీంతో రియల్టర్ కొంత నగదుతో పాటు తన 51 ప్లాట్లను నయీమ్‌కు అప్పగిం చాడు. అప్పటి నుంచి సదరు స్థలం వద్దకు ఎవరూ రాలేదు. నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మిర్యాలగూడలోని ఓ నివాసంపై సిట్ అధికారులు దాడులు నిర్వహించగా.. అవుశాపూర్‌కు చెందిన ప్లాట్ల డాక్యుమెంట్లు  లభ్యమయ్యాయి.

దీంతో రియల్టర్ సురేందర్‌రెడ్డి సదరు ప్లాట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నాడు. 4 రోజుల నుంచి చదును చేసి, ప్లాట్ల సరిహద్దు రాళ్లను ఏర్పా టు చేస్తున్నాడు. పంచాయతీ అధికారులు పనులను ఆపాలని కోరినా ఫలితం లేక పోలీ సులను ఆశ్రరుుంచారు. పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పనులను నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత  పనులు ప్రారంభించారు. కాగా రియల్టర్‌వి 51 ప్లాట్లుంటే 14 ఎకరాల వెంచర్‌ను చదును చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
 
మౌఖిక ఆదేశాలు ఇచ్చారు: సీఐ ప్రకాశ్
వెంచర్‌లోని రియల్టర్ సురేందర్‌రెడ్డి 51 ప్లాట్ల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిట్ అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని సీఐ ప్రకాశ్ తెలిపారు.

మరిన్ని వార్తలు