దివాకర్‌ ట్రావెల్స్‌ ఉల్లంఘనలకు పాల్పడింది

19 Jul, 2017 02:30 IST|Sakshi
హైకోర్టుకు నీరబ్‌కుమార్‌ నివేదిక
 
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జిల్లా ముండ్ల పాడు వద్ద ప్రమాదానికి గురైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ఎటువంటి నిబంధలను ఉల్లంఘించలేదంటూ క్లీన్‌చిట్‌ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహంతో దిగొచ్చిం ది. ఆ బస్సు విషయంలో దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం పలు ఉల్లంఘ నలకు పాల్పడిందని మంగళవారం హైకోర్టుకు నివేదించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ స్వయంగా కోర్టు ముందు హాజరై ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు.

మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికుల చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. దివాకర్‌ ట్రావెల్స్‌ సహా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మిగిలిన యాజమాన్యాలన్నింటికీ కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్‌ 11కి వాయిదా వేసింది.
మరిన్ని వార్తలు