ఎక్సైజ్ పాలసీ ఖరారు

11 Sep, 2015 19:30 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ ఖరారైంది. ఈమేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేశారు. రిటైల్ మద్యం దుకాణాలకు సంబంధించిన విధివిధానాలను ఇందులో పేర్కొన్నారు. కొత్త మద్యం విధానంలో తెలంగాణలోని మొత్తం 2216 మద్యం దుకాణాలకు ఆరు శ్లాబులను అమలు చేయనున్నారు. రెండేళ్ల పాటు ఆయా దుకాణాలకు ఈ లైసెన్సులు అమల్లో ఉంటాయి.

కొత్త మద్యం పాలసీలో లైసెన్స్ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి
10వేల జనాభా వరకు రూ.39లక్షలు
10వేల నుంచి 50వేల జనాభా వరకు రూ.40.80లక్షలు
50వేల నుంచి 3లక్షల జనాభా వరకు రూ.50.40 లక్షలు
3లక్షల నుంచి 5లక్షల జనాభా వరకు రూ.60లక్షలు
5లక్షల నుంచి 20లక్షల జనాభా వరకు రూ.81.60లక్షలు
20లక్షలు పైబడిన ప్రాంతాలకు రూ.1.8కోట్లు
వచ్చే నెల 1 నుంచి ఈ కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. 2017 సెప్టెంబరు 30 వరకు ఈ విధానాలు అమల్లో ఉంటాయి.

మరిన్ని వార్తలు