కానిస్టేబుళ్లకు సరికొత్త శిక్షణ

3 May, 2017 00:52 IST|Sakshi
కానిస్టేబుళ్లకు సరికొత్త శిక్షణ

ట్రైనీలకు ‘క్రావ్‌ మగ’ ఆత్మరక్షణ కోర్సు: డీజీపీ అనురాగ్‌శర్మ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరిగిన పోలీసు నియామకాల్లో ఎంపికైన కానిస్టే బుళ్లకు సరికొత్త మాడ్యుల్‌తో శిక్షణ మొదలైంది. గతంలోని మూస శిక్షణ పద్ధతులకు స్వస్తి పలుకుతూ పూర్తిస్థాయిలో శిక్షణ షెడ్యూల్‌ను అందుబా టులోకి తెచ్చారు. పెరుగుతున్న టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంశాలను దృష్టిలో పెట్టు కొని పోలీసు సిబ్బంది మాన సిక స్థితిగతు లను కూడా అభివృద్ధి చేసే దిశగా రెండు సెమిస్టర్ల శిక్షణ విధానాన్ని ప్రవేశపెట్టారు.

రెండు సెమిస్టర్లు: 9 నెలలపాటు 7,379 మంది సిబ్బందికి సాగే శిక్షణలో జీవన నైపుణ్యాలు, కమ్యూనిటీ పోలీ సింగ్, పబ్లిక్‌ స్పీకింగ్, ఇజ్రాయెల్‌ సిబ్బందికి ఇచ్చే  ‘క్రావ్‌ మగ’ ఆత్మరక్షణ, చిన్నారులపై లైంగిక వేధింపులు –నియంత్రణ, మనుషుల అక్రమ రవాణా, జెండర్‌ అవేర్‌నెస్, నైపు ణ్యాలు, సైబర్‌ క్రైమ్స్, ఆర్థిక నేరాలు–దర్యాప్తు తీరుతె న్నులుంటాయని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్ల డించారు. వీటితో పాటు నేరాలు, నియం త్రణకు మార్గదర్శ కాల మీద దృష్టిపెట్టినట్లు డీజీపీ తెలిపారు. చివరగా సిబ్బంది మొత్తా నికి సైకోథెరపిస్టు –మెంటరింగ్, ప్రజలతో ఎలా వ్యవహరిం చాలన్న అంశంలో ముఖా ముఖి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంపికైన వారికి ల్యాప్‌ ట్యాప్‌ అందజేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు