కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ

22 Aug, 2016 19:02 IST|Sakshi
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనుంది. కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. అయా జిల్లాల వారీగా ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలియజేయవచ్చు. అందుకోసం ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది.
 
ప్రతిపాదిత కొత్త జిల్లాల రూపురేఖలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను ఆ పోర్టల్ లో ప్రభుత్వం జిల్లాల వారీగా తెలియజేసింది. హైదరాబాద్ కు సంబంధించి ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఆ వివరాలను ముసాయిదాలో ప్రస్తావించలేదు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన పోర్టల్ www.newdistrictsformation.telangana.gov.in  లో వివరాలను చూడవచ్చు. 
 
తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది.  కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది.
 
ఆదిలాబాద్.. రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి
ఖమ్మం..రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి

కరీంనగర్..రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి                                                                                                                                                              
మహబూబ్ నగర్ ..రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి

మెదక్.. రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి

నల్గొండ..రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి

నిజామాబాద్..రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి

రంగారెడ్డి జిల్లా...రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి

వరంగల్...రెవెన్యూ డివిజన్లు, మండలాలు వివరాల కోసం క్లిక్ చేయండి

 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా