‘నెక్ట్స్’ పరీక్ష అవసరం లేదు!

30 Nov, 2016 03:06 IST|Sakshi
‘నెక్ట్స్’ పరీక్ష అవసరం లేదు!

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి జాతీయ స్థారుులో ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)’ పేరిట మరో అర్హత పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ‘నెక్ట్స్’లో ఉత్తీర్ణులైతేనే వారు ప్రాక్టీస్ చేసేం దుకు అనుమతించే (రిజిస్ట్రేషన్ చేసే) అంశం ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. దానివల్ల జాతీయ స్థారుులో వైద్య విద్య నిర్వహణపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొంది. వైద్య విద్యకు సంబంధించి పలు ప్రతిపాదనలు రూపొందించిన కేంద్రం... వాటిపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ ఇటీవల చెక్ లిస్ట్ పంపిన సంగతి తెలిసిందే.

ఈ చెక్‌లిస్టులపై కేంద్రం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరె న్‌‌స కూడా నిర్వహించింది. ఇందులో తెలంగాణ వైద్యాధికారులు కేంద్రానికి తమ అభిప్రాయాలను వివరించారు. ఎంబీబీఎస్ పరీక్ష పత్రాలను ఆరోగ్య విశ్వవిద్యాలయమే తయారు చేసి పరీక్ష నిర్వహిస్తుందని, అనంతరం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే మూల్యాంకనం చేస్తారని... ఇంత పకడ్బందీగా పరీక్ష జరుగుతున్నప్పుడు ‘నెక్ట్స్’ అవసరం ఏముంటుందని రాష్ట్ర అధికారులు ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ‘నెక్ట్స్’ను కచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.

 విరమణ వయసుపై అస్పష్టత
 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు సహా ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 70 ఏళ్లకు పెంచే విషయంపై కేంద్రం అభిప్రాయం కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తెలియజేయలేదు. తదుపరి జరిగే సమావేశంలో దీనిపై అభిప్రాయం వెల్లడిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు వైద్య అధ్యాపకుల విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు అమలు చేస్తున్నారుు. రాష్ట్రంలో మాత్రం ఇది 58 ఏళ్లుగా మాత్రమే ఉంది. దీనిపై రాష్ట్ర వైద్య వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. అరుుతే వైద్య అధ్యాపకుల విరమణ వయసు పెంచితే ఇతర ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుందన్న భయంలో తెలంగాణ సర్కారు ఉంది. వైద్య విద్యకు సంబంధించి కేంద్రం తదుపరి ఢిల్లీలో ఒక వర్క్‌షాప్ నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రచించనుంది.
 
 వైద్య ప్రవేశాలకు ఒకే కౌన్సెలింగ్
 ‘నీట్’ పరీక్ష తదనంతరం రాష్ట్ర స్థారుులో ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల కోసం ఒకే కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఈ ఏడాది నుంచి నీట్ ద్వారా ప్రవేశాలు ప్రారంభమైనా కౌన్సెలింగ్‌లు మాత్రం వేర్వేరుగా జరిగారుు. బీ కేటగిరీ సీట్లకు నాన్ మైనారిటీ కాలేజీలు ప్రత్యేకంగా ఒక కౌన్సెలింగ్ నిర్వహించగా.. మైనారిటీ కాలేజీలు మరో కౌన్సెలింగ్ నిర్వహించారుు. అలాగే ఎంసెట్ ఆధారంగా ఈసారి ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లకు మరో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలా వేర్వేరుగా కాకుండా ఒకే కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్యాధికారులు కేంద్రాన్ని కోరారు. అలాగే నీట్ పరీక్షను తెలుగు మీడియంలోనూ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు