ఎన్‌జీటీ ఉత్తర్వులు ఏకపక్షం

3 Jan, 2017 02:37 IST|Sakshi
ఎన్‌జీటీ ఉత్తర్వులు ఏకపక్షం

కొట్టేయాలంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌
మా వాదనలు వినకుండానే ‘పాలమూరు’పై ఉత్తర్వులిచ్చింది
రాజకీయ ప్రయోజనాలను ఆశించే కొందరు పిటిషన్‌ వేశారు


సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐసీ) పనులను నిలిపేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యం గురించి ప్రస్తావించారు. మంగళవారం పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరిం చింది. అటవీ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసు కోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన బి.హర్షవర్ధన్‌ ఎన్‌జీటీని ఆశ్రయించారు.

వాదనలు విన్న ఎన్‌జీటీ.. పీఆర్‌ఎల్‌ఐఎస్‌ పనులను నిలిపేయాలంటూ గత నెల 13న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా హైకోర్టులో సవాలు చేశారు. హరిత ట్రిబ్యునల్‌ తమ వాదనలు వినకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసిందని వారు వివరించారు. ట్రిబ్యునల్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింద న్నారు. సంక్షేమ ప్రాజెక్టు విషయంలో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని తెలి పారు. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు.

రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఈ వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపారు. ఇప్పటికే పనుల అప్ప గింత కూడా పూర్తయిందని, ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల వల్ల ప్రాజెక్టు వ్యయాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గత కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు ప్రయత్ని స్తున్నారని, ఈ న్యాయ స్థానం కూడా ఇప్పటి వరకు వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వ లేదని వివరించారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి హైకోర్టులో నాగం జనార్దన్‌రెడ్డి వివిధ సందర్భాల్లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల గురించి ప్రస్తావించారు.

వన్యప్రాణులకు ఎక్కడా ముప్పు లేదు
గత ఏడు నెలలుగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, ఈ విషయాన్ని ట్రిబ్యునల్‌ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ‘‘అటవీ ప్రాంతంలో పనులు జరుగుతున్నాయని అటవీ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇచ్చిన తర్వాతే తెలిసింది. దీంతో అనవసర వివాదాలకు తావు లేకుండా అటవీ భూమిలో కాకుండా మరో చోట పంప్‌ హౌస్‌ నిర్మాణానికి నిర్ణయించాం. అంతేకాక అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణాలు చేపడుతున్నాం. ఈ విషయాలన్నింటినీ సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పీఆర్‌ఎల్‌ఐఎస్‌ నిర్మాణ పనులు ఎక్కడా కూడా అటవీ భూముల్లో జరగడం లేదు. ప్యాకేజీ 1, 2 పనులు ఎక్కడా కూడా ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో గానీ, ప్రస్తుతం ప్రతిపాదించిన ఎకో సెన్సిటివ్‌ జోన్‌లో గానీ జరగడం లేదు.

ఈ ప్రాజెక్టు వల్ల వ్యన్యప్రాణులకు ఎక్కడా ఎలాంటి  ముప్పు వాటిల్లడం లేదు. అటవీ ప్రాంతానికి వెలుపల పనులు చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ చట్టం కింద ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి న అవసరం లేదు’’ అని పిటిషన్‌లో వివరించారు. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వ్యక్తి అవాస్త వాలతోనే నిలిపివేత ఉత్తర్వులు పొందారని పేర్కొన్నారు. చట్టపరమైన అనుమ తులు లేవన్న ఉద్దేశంతో ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులిచ్చిం దని వివరించారు.  కేసులో ఉత్తర్వులు ఇచ్చే ముందు ట్రిబ్యునల్‌ కనీసం తమ వాదనలు వినడం గానీ, తమ హాజరుకు ఆదేశాలు ఇవ్వడం గానీ చేయలేదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుతో 1,131 గ్రామాలకు, 50 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. ట్రిబ్యునల్‌ ఏకపక్ష ఉత్తర్వులను కొట్టేయాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు