ఎండీడీఎల్ దిగువన ఎందుకు తోడారు?

7 Oct, 2016 02:24 IST|Sakshi
ఎండీడీఎల్ దిగువన ఎందుకు తోడారు?

శ్రీశైలంపై కేంద్రానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కనీస నీటి మట్టానికి (ఎండీడీఎల్) దిగువన నీటిని తోడటం వల్ల రాయలసీమ ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లిందంటూ బొజ్జా దశరథరామిరెడ్డి అనే రైతు వేసిన పిటిషన్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది.ఏ కారణాలతో నీటిని తోడారో తెలపాలని కేంద్ర జలవనరులశాఖకు నోటీసు జారీ చేసింది. కేంద్ర సూచన మేరకు కృష్ణా బోర్డు తెలంగాణ, ఏపీలకు గురువారం లేఖలు రాసి అభిప్రాయాలు కోరింది.

రెండేళ్లుగా తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితుల దృష్ట్యా ఇరు రాష్ట్రాలు శ్రీశైలం ప్రాజెక్టులో 790 అడుగుల దిగువకు వెళ్లి నీటిని వాడేశాయి. ఈ స్థాయిలో నీటిని తోడటంతో రాయలసీమ ప్రాజెక్టులకు నీటి తరలింపు సమస్యగా మారిందని, తాగునీటికీ ఇబ్బందు లు తలెత్తాయని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో దశరథరామిరెడ్డి పిటిషన్ వేశారు. మరోవైపు ఈ అంశంపై తెలంగాణ వివరణ సిద్ధం చేసినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు