స్కూళ్లలో నెలకోసారి నో బ్యాగ్‌ డే!

6 Jan, 2018 03:29 IST|Sakshi

కర్ణాటక తరహాలో అమలుకు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో నెలకు ఒకసారి విద్యార్థులు పుస్తకా లు లేకుండా బడికి వచ్చేలా ‘నో బ్యాగ్‌ డే’ను అమలు చేసే అంశాన్ని విద్యాశాఖ పరిశీలి స్తోంది. కర్ణాటకలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని భావిస్తోంది.

విద్యార్థుల బ్యాగు బరువును తగ్గించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ వాటి అమలుకు చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు, పాఠశా లల్లో పుస్తకాలను దాచుకునేలా ర్యాక్‌లను ఏర్పాటు చేయాలని కోరు తోంది. దానిపై ఇప్పటికే పలు ప్రైవేటు స్కూళ్లు చర్యలు చేపట్టాయని పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు