నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

3 Apr, 2016 01:54 IST|Sakshi

హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ పరీక్షను ఈ నెల 3న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షకు, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పేపర్-2 (బీ ఆర్క్/ బీ ప్లానింగ్) పరీక్షకు విద్యార్థులు నిమిషం లేటైనా అనుమతించేది లేదని సీబీఎస్‌ఈ వెల్లడించింది.

పరీక్షలను వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 59,731 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపింది. పేపర్-1 పరీక్షకు విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచి, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1:00 గంట నుంచి హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు పరీక్షా హాల్లోనే అందజేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.

>
మరిన్ని వార్తలు