'తెలంగాణలో అభివృద్ధికి పునాదే పడలేదు'

6 Jan, 2016 16:37 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో అసలు అభివృద్ధికి పునాదే పడలేదని తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి విమర్శించారు. కానీ టీఆర్ఎస్ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజలను టీఆర్ఎస్ నేతలు మబ్బి పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్థానిక నేతలను బెదిరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జానా ధ్వజమెత్తారు.

అయినా నల్లగొండ, మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు అడ్డుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతపక్షం ఉండకూడదన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తెలంగాణ వాదులు తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్ ఏకపక్ష వైఖరి వ్యవహరిస్తోందని జానారెడ్డి విమర్శించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా