‘కేసీఆర్‌ కిట్‌’ సిబ్బందికి జీతాల్లేవ్‌

19 Sep, 2017 02:56 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఇలాంటి కీలకమైన పథకం అమలు కోసం పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మాత్రం వేతనాలు రావడం లేదు.  కేసీఆర్‌ కిట్‌ ఉత్తమ పరిపాలన కేటగిరీలో అందించే అవార్డుకు సైతం ఎంపికైంది. కేసీఆర్‌ కిట్‌ అమలు బాధ్యతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టింది. వైద్యశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

పథకం అమలు కోసం ప్రత్యేక అధికారిని, రాష్ట్ర కార్యాలయంలో మరో ఐదుగురు, ప్రతి జిల్లాలో ఒకరు చొ ప్పున సిబ్బందిని నియమించారు. ఈ పథ కం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అధి కారి సహా మిగిలిన వారికి వేతనాలు అంద డంలేదు. ఎవరికి ఎంత వేతనం అనేది  ఇప్పటికీ ఖరారు కాలేదని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు