ఎన్నిసార్లయినా విత్‌డ్రా.. నో చార్జీ

22 Jul, 2017 03:31 IST|Sakshi
ఎన్నిసార్లయినా విత్‌డ్రా.. నో చార్జీ
- పోస్టల్‌ ఏటీఎం విత్‌డ్రాలపై నో సర్వీస్‌ చార్జీ 
రూ. 50తోనే ఖాతా.. ఏటీఎంల్లో ఎనీటైం నగదు
తెలంగాణ తంతి తపాలా సర్కిల్‌ సంచాలకులు వీవీ సత్యనారాయణ రెడ్డి 
 
సాక్షి, హైదరాబాద్‌: పోస్టల్‌ ఏటీఎం విత్‌ డ్రాలపై సర్వీస్‌ చార్జీ లేదని, ఎన్ని పర్యాయాలైనా డబ్బులు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు ఉందని తెలంగాణ తంతి తపాలా సర్కిల్‌ సంచాలకులు వీవీ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్‌ ఏటీఎంల్లో అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డులు పనిచేస్తాయని, ఇతర బ్యాంకు ఏటీఎంల మాదిరిగా మూడు విత్‌డ్రాలు దాటగానే సర్వీస్‌ చార్జీ పడదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 ఏటీఎంల్లో ఎనీ టైం నగదు అందుబాటులో ఉంటుందని వివరించారు. పోస్టాఫీసుల్లో రూ.50తో సేవింగ్‌ ఖాతా తెరవచ్చన్నారు. పోస్టల్‌ బ్యాంక్‌ ఖాతాలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు పోస్టాఫీసుల ద్వారానే అందిస్తున్నామని చెప్పారు. హన్మకొండ, మహబూబ్‌నగర్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని చోట్ల విస్తరిస్తామన్నారు. ఆధార్‌ అప్‌డేట్, ఎన్‌రోల్‌ మెంట్‌ కేంద్రాలను కూడా త్వరలో ప్రారం భించనున్నట్లు చెప్పారు. పోస్టల్‌ శాఖ జీవిత, ప్రమాద బీమా, పెన్షన్, బాలికల, సీనియర్‌ సిటిజన్‌ తదితర పథకాలను అమలు చేస్తోం దన్నారు. పోస్టాఫీసులను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలన్నారు.
మరిన్ని వార్తలు