ఇషాచావ్లా సందడి

22 Aug, 2016 22:39 IST|Sakshi
అవగాహన కల్పిస్తున్న హీరోయిన్‌ ఇషాచావ్లా
గన్‌ఫౌండ్రీ : గోషామహల్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(టీటీఐ)లో హీరోయిన్‌ ఇషాచావ్లా సందడి చేసింది. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గోషామహల్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌కై దళారులను ఆశ్రయించకుండా నేరుగా డ్రైవింగ్‌ టెస్ట్‌లో పాల్గొనాలని సూచించారు. తాను సైతం మొదటిసారి డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఫెయిలయ్యానని, రెండవసారి మాత్రం ఏకాగ్రతతో డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినట్లు తెలిపారు.ట్రాఫిక్‌ డీసీపీ ఎ.వి. రంగనాథ్‌ మాట్లాడుతూ... నేటితరం పిల్లలకు స్కూల్‌ లాంటి ఇంటినుంచే ట్రాఫిక్‌ నిబంధనలను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, హెల్మెట్‌ లేని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌కార్డ్‌ను వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త అనిల్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరహరి తదితరులు పాల్గొన్నారు. 
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు