నిర్వాసితులంతా హైకోర్టును ఆశ్రయించాలి

12 Aug, 2016 01:59 IST|Sakshi
నిర్వాసితులంతా హైకోర్టును ఆశ్రయించాలి

సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సాక్షి, హైదరాబాద్: భూ నిర్వాసిత రైతులంతా హైకోర్టును ఆశ్రయించి 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం సాధించాలని సీపీఎం సూచించింది. ఈ చట్టంలో పేర్కొన్న గ్రామసభల నుంచి ఇతర హక్కులన్నీ అమలు జరిపించాలని కోరింది. ఇది బలవంతపు భూసేకరణ కాదని కోర్టులో అబద్ధాలు చెప్పి భూముల రిజిస్ట్రేషన్‌కు  ప్రభుత్వం అనుమతి పొందిందని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కోర్టు రూలింగ్ బాధాకరమైనా, 2013 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో అమలు జరిపిస్తామని కోర్టు పేర్కొనడం రైతులకు కొంత ఊరట కలిగించిందన్నారు.

పునరావాసం కింద ఉపాధి పరిహారం రూ. 7.5 లక్షల వరకు చెల్లించేట్లుగా 190 డ్రాఫ్ట్ జీవోను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది కాని చట్టబద్ధ హక్కులను విస్మరించిందని విమర్శించారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణను చేయాలని కోరే రైతులంతా కోర్టును ఆశ్రయిస్తే అందుకు అందరికీ అనుమతినిస్తామని హైకోర్టు రూలింగ్ ఇచ్చిందని తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటీ పేర్కొంది. కోర్టు ఇచ్చిన ఈ సౌలభ్యాన్ని భూములు కోల్పోయే రైతులు వినియోగించుకోవాలని కమిటీ కన్వీనర్ బి.వెంకట్ కోరారు.

మరిన్ని వార్తలు