30 సర్కిళ్లు మారిన గ్రేటర్ ముఖచిత్రం

2 Nov, 2016 00:57 IST|Sakshi
30 సర్కిళ్లు మారిన గ్రేటర్ ముఖచిత్రం

పూర్తయిన జీహెచ్‌ఎంసీ పునర్విభజన
24 నుంచి 30కి పెరిగిన సర్కిళ్లు

3 డివిజన్లున్న సర్కిళ్లు: గచ్చిబౌలి, ఆర్‌సీపురం,పటాన్‌చెరు, అల్వాల్ 8 డివిజన్లున్న సర్కిల్: చార్మినార్ కొత్త సర్కిళ్ల పేర్లు: హయత్‌నగర్, గడ్డిఅన్నారం, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, బేగంబజార్, ఫలక్‌నుమా,మెహిదీపట్నం, కార్వాన్, ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, మూసాపేట, గాజులరామారం, మోండా మార్కెట్

సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ముఖచిత్రం మారింది. ప్రస్తుతం 24 సర్కిళ్లుగా ఉండగా, వీటిని 30 సర్కిళ్లకు మార్చారు. దీంతో ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు గ్రేటర్ పునర్విభజన పూర్తరుునట్లే. 2011 జనాభా లెక్కల మేరకు జీహెచ్‌ఎంసీని గతంలో ఉన్న 18 సర్కిళ్ల నుంచి 30 సర్కిళ్లకు మార్చాలని కమిటీ సిఫారసు చేయగా, గత సంవత్సరం సెప్టెంబర్ 9న 18 సర్కిళ్లను 24 సర్కిళ్లుగా మార్చారు. ప్రస్తుతం మరో ఆరు సర్కిళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ మొత్తం 30 సర్కిళ్లుగా మార్చారు. ప్రసాదరావు కమిటీ స్టాఫింగ్ ప్యాటర్న్ మేరకు మొత్తం 30 సర్కిళ్లు ఏర్పాటు చేయగా, ఒక్కో జోన్‌కు ఆరు సర్కిళ్లు ఉండనున్నారుు. జీహెచ్‌ఎంసీలో మొత్తం  ఐదు జోన్లుండటం తెలిసిందే.

2011 జనాభా లెక్కల మేరకు, కోర్‌ఏరియా పరిధిలోని 15 సర్కిళ్లల్లో ఒక్కో సర్కిల్‌కు సగటున 2.65 లక్షల జనాభా, శివార్లలోని సర్కిళ్లలో ఒక్కో సర్కిల్‌కు సగటున 2.25 లక్షల జనాభా ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790 కాగా, ఒక్కో డివిజన్‌లో దాదాపు 45 వేల జనాభా ఉంది. గతంలో ఒక సర్కిల్‌లో 3 డివిజన్లు మాత్రమే ఉండగా, ఒక డివిజన్‌లో 16 డివిజన్ల వరకున్నారుు. ప్రస్తుతం భారీ వ్యత్యాసం లేకుండా సగటున ఒక్కో సర్కిల్‌లో ఐదారు డివిజన్లుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత కొత్త సర్కిళ్లలో కొన్నింట్లో అత్యల్పంగా మూడు డివిజన్లు మాత్రమే ఉండగా, అత్యధికంగా చార్మినార్ సర్కిల్‌లో 8 డివిజన్లున్నారుు.

మరిన్ని వార్తలు