50 ఏళ్ల కిందట ఇదే రోజు ఏడో నిజాం కన్నుమూత

24 Feb, 2017 14:37 IST|Sakshi
50 ఏళ్ల కిందట ఇదే రోజు ఏడో నిజాం కన్నుమూత

హైదరాబాద్‌: నిజాం అంటేనే చాలామంది చిరాకు.. ఇంకొం‍దరికి కోపం.. డిబేట్లకు అవకాశం ఇస్తే మైకులు పగిలిపోయేంత గట్టిగా మాట్లాడతారు. అరాచకాలు, ఆకృత్యాలు, నిరంకుశత్వం అంటూ ఇలా చెప్పుకుంటూ వెళితే చాంతాడంత. ఎంత చెడ్డవారైనా వారు చేసిన కాస్తంత మంచి పనిని గుర్తించి ఆ మంచిని తెలియజేయడమే సరైన చర్య. హైదరాబాద్‌ చివరి నిజాం, దాదాపు ఆధునిక భాగ్యనగరానికి అంకురార్పణ చేసిన వ్యక్తి ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌. నేడు ఆయన 50 వర్ధంతి.

నిమోనియా కారణంగా కింగ్‌ కోటి ప్యాలెస్‌లో 1967, ఫిబ్రవరి 24 అంటే సరిగ్గా ఇదే రోజు చనిపోయాడు. అయితే, నేడు ఆయనను తలుచుకునేవారు లేరు. ఆయన కోసం నిర్మించిన మస్జిద్‌ ఈ జుడి అనే సమాధి కూడా పట్టించుకోకుండా మిగిలిపోయింది. ఏడో నిజాం మరుగున పడిన రాజే అనే ఇప్పటికే పలు పరిణామాలు చెప్పినా ఒకసారి ఉస్మాన్‌ చేసిన కొన్ని మంచి పనులు ఆయన వర్ధంతి సందర్భంగా చూస్తే..

  • ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి
  • నిజామ్‌ హాస్పిటల్‌(ఇప్పుడు నిమ్స్‌)
  • ఉస్మాన్‌ సాగర్‌ అండ్‌ హిమాయత్‌ సాగర్‌(ఇవి రెండు కూడా తాగునీటి రిజర్వాయర్లు)
  • మూసీనదిపై నిర్మించిన నయాపూల్‌ వంతెన
  • బేగంపేట విమానాశ్రయం
  • నిజాం స్టేట్‌ రైల్వేస్‌
  • అజం ఆజాహి టెక్స్‌ టైల్‌ మిల్స్‌ వరంగల్‌
  • హైకోర్టు భవనం
  • అసెంబ్లీ భవనం
  • నాంపల్లి రైల్వే స్టేషన్‌
  • జూబ్లీహాల్‌.. ఇంకా ఇలాంటివి, చిన్నచిన్నవి చాలానే ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు