గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ ఇంట్లో మరోసారి సోదాలు

11 Aug, 2016 09:31 IST|Sakshi

హైదరాబాద్‌: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ఎన్‌కౌంటర్ తదనంతరం రెండు రోజులుగా జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్కాపురిలోని నయీం ఇంట్లో గురువారం మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించనున్నారు. నయీం ఇంట్లో పెద్ద ఎత్తునా బంగారం, ఏకే 47, ఫారెన్‌ వాచ్‌లు, వందల సంఖ్యలో డాక్యుమెంట్లు ఉన్నట్టు సమాచారం ఉంది. దాంతో పోలీసులు నయీం ఇంట్లో నేడు సోదాలు నిర్వహించి అతడి ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టుకు తెలుపనున్నారు. నేడు నయీం పనిమనిషి ఖాజా ఉద్దీన్‌ను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. నిన్న గోవాలో నయీం బంగ్లాలో అనుచరుడు ఖాజాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. నయీం అక్కా బావను మహబూబ్‌నగర్‌ జైలుకు పోలీసులు తరలించారు.

కాగా, నయీం ఇంట్లో బుధవారం పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అల్కాపురిలోని నయీం ఇంట్లోని బెడ్‌రూంను పోలీసులు తెరిచి అతడి బెడ్‌రూంలో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా, ఈ రోజు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం)తో నార్త్‌జోన్‌ ఐజీ, సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి భేటీ కానున్నారు. నయీం కేసుపై అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల టార్గెట్‌తో విచారణ ను సిట్‌ వేగవంతం చేసే పనిలో పడింది.

మరిన్ని వార్తలు