టెక్నాలజీని వాడుకుంటూ వ్యభిచారం!

20 Sep, 2014 16:04 IST|Sakshi
టెక్నాలజీని వాడుకుంటూ వ్యభిచారం!

వారు చెప్పిన అడ్రస్లో అమ్మాయిలు రెడీ!
సినిమా, ఉద్యోగ అవకాశాల పేరుతో నగరానికి వచ్చే అమ్మాయిలే వారి టార్గెట్!
బేరసారాలు అన్నీ ఆన్లైన్లోనే
పోలీసుల ఎత్తులకు పైఎత్తులు

హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో అంతే శరవేగంతో వృద్ధి చెందుతున్న టెక్నాలజీని వాడుకుంటూ విస్తృతంగా వ్యభిచారం కొనసాగుతోంది. వ్యభిచార నిర్వాహకులు పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తమ వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సినిమా, ఉద్యోగ అవకాశాల పేరుతో నగరానికి వచ్చే అమ్మాయిలను బ్రోకర్లు టార్గెట్గా చేసుకుంటారు. ఇక విటులుగా బడాబాబుల పిల్లలను తమ బుట్టలో వేసుకుంటుంటారు.  

  వారి వెబ్సైట్లో ఫోన్ నెంబర్తోపాటు అమ్మాయిల ఫొటోలు కూడా పెడతారు.  బేరసారాలు అన్నీ ఆన్లైన్లోనే. బుకింగ్, పేమెంట్ అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. వెబ్లో పెట్టిన నెంబర్కు ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెబుతారు. బేరాలు, సమయం, ప్లేసు అన్నీ చెప్పేస్తారు. ఏ ఇబ్బందులూ ఉండవని దైర్యం చెబుతారు. వారిని కలవవలసిన ప్రదేశాన్ని తరచూ మారుస్తుంటారు. వారు చెప్పినచోటకు వెళితే అక్కడ నుంచి కారులో మళ్లీ మరోచోటుకు తీసుకువెళతారు. సాక్షిటీవి సేకరించిన సమాచారం ప్రకారం బ్రోకర్లు  హైదరాబాద్, భరత్ నగర్లో శశికళ, చంద్రకళ థియేటర్ల దగ్గరకు వచ్చి కాల్ చేయమని చెప్పారు.

 బ్రోకర్ తో మాట్లాడితే అమ్మాయిలు తరచూ మారుతుంటారని చెప్పాడు. అమ్మాయి ఒక పూటకు కావాలంటే 5వేల రూపాయలు, ఒక నైట్కు అయితే పది వేల రూపాయలని చెప్పాడు. ఎర్రగడ్డ ప్రాంతంలో అమ్మాయిలు ఉన్నట్లు తెలిపాడు. అయితే అమ్మాయిలు ఉండే ప్రదేశాలను తరచూ మారుస్తుంటారు. వారికి డబ్బు ముట్టిన తరువాతే అమ్మాయిని ఒంటరిగా పంపుతారు. డబ్బు వారికి అందిన తరువాత, వారు చెప్పిన అడ్రస్లో అమ్మాయిలు రెడీగా ఉంటారు. అందినకాడికి దోచుకోవడమే బ్రోకర్ల పని. అమ్మాయిలకు ముట్టజెప్పిన సొమ్ములో సగానికి పైగా బ్రోకర్లకే పోతుంది. అమ్మాయిలకు వేల రూపాయలు ముడితే, బ్రోకర్లకు లక్షల రూపాయలు ముడుతున్నాయి.
**

మరిన్ని వార్తలు