కేటీఆర్‌ ప్రోద్బలంతోనే నేరెళ్ల దుశ్చర్య

15 Aug, 2017 02:34 IST|Sakshi
కేటీఆర్‌ ప్రోద్బలంతోనే నేరెళ్ల దుశ్చర్య

టీఆర్‌ఎస్‌కు ప్రైవేటు సైన్యంగా ఐపీఎస్‌లు...
చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షాలు


సాక్షి, హైదరాబాద్‌:  మంత్రి కె.తారకరామా రావు ప్రోద్బలంతోనే నేరెళ్లలో దళితులపై పోలీసులు అత్యంత పాశవికంగా హింసకు పాల్పడ్డారని రాష్ట్ర గవర్నర్‌కు అఖిలపక్షాలు ఫిర్యాదు చేశాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్, బీజే పీ, టీడీపీ, సీపీఐ, జేఏసీ నేతలు రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్‌ను కలిశారు. కె.జానా రెడ్డి, షబ్బీర్‌ అలీ, సంపత్‌కుమార్‌ (కాంగ్రెస్‌), కె.లక్ష్మణ్, చింతా సాంబమూర్తి (బీజేపీ), ఎల్‌. రమణ, ఎ.రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సిం హులు (టీడీపీ), చాడ వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌ (సీపీఐ), ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం (జేఏసీ), ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, పురుషోత్తం తదితరులు గవర్నర్‌ను కలసి నేరెళ్లలో జరిగిన దాడి గురించి ఆయనకు వివరించారు. 

తెలం గాణలో మానవ హక్కులను హరిస్తున్నారని, రైతులకు బేడీలు వేస్తున్నారని, సిరిసిల్లలో ఇసుక మాఫియాకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పనిచేస్తున్నదని ఫిర్యాదు చేశారు. సిరి సిల్లలో దళితులపై దాడి ఘటనకు మంత్రి కేటీ ఆర్‌ ప్రమేయమే కారణమన్నారు. ఐపీఎస్‌ అధికారులను ప్రైవేటు సైన్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వినియోగించుకుంటున్నదన్నారు. అందుకే దళితులను హింసించిన ఎస్పీపై చర్యలు తీసుకోకుండా ఒక ఎస్‌ఐని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని ఆరో పించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీ ఆర్‌ తన సోదరునికోసం పోలీసులను విని యోగించారని ఫిర్యాదు చేశారు. దీనిపై సమ గ్రంగా విచారణ జరిపించాలని, వాస్తవాలను పరిశీలించిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని కోరారు. అఖిలపక్షాల ఫిర్యాదుపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్టుగా వివిధ పార్టీల నేతలు వెల్లడించారు.  

కేటీఆర్‌ వైదొలగాలి
నేరెళ్లలో దళితులపై దాడికి కారణమైన మంత్రి కేటీఆర్‌ పదవినుంచి వైదొలగా లని,కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పట్టిం చుకోకుంటే ఈ నెల 21, 22న రాష్ట్రపతిని కలుస్తామన్నారు. నేరెళ్ల ఘటనపై జాతీయ ఎíస్సీ కమిషన్‌ నివేదిక ఇచ్చినా, ప్రభుత్వ మెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు