మన మిస్సమ్మలు

18 Jan, 2015 23:49 IST|Sakshi
మన మిస్సమ్మలు

యాభై ఏళ్ల వయసున్న నవయవ్వని మిస్ ఇండియా. ప్రపంచానికి భారతీయ సౌందర్యపు వెలుగులు చూపించిన అందాల పోటీ ప్రారంభమై అర్ధ శతాబ్దం పూర్తయింది. అయితే ఇప్పటికీ ఆ పోటీలో గెలుపొందిన తెలుగమ్మాయి ఒక్కరంటే ఒక్కరే. ఆరేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్న మిస్ హైదరాబాద్ పుణ్యమా అని.. గతం ఎలా ఉన్నా భవిష్యత్తు ఊరిస్తోంది. త్వరలో జరగనున్న‘కుమారి భారతదేశం’ ఎంపిక కోసం నగరం పెద్ద సంఖ్యలోనే పోటీదారులను అందిస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ ‘ మిస్ హైదరాబాద్ టు మిస్ ఇండియా’...            ..:: ఎస్.సత్యబాబు
 
యాభై ఏళ్ల మిస్ ఇండియా హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఈ అందాల రేసులో సిటీ అమ్మాయిలు పోటీపడుతున్నారు. సిటీలో జరిగిన ఆడిషన్స్‌కు హాజరైన వారిని అటుంచితే.. నేరుగా ముంబై ఇంటర్వ్యూకి సెలక్టయినవారి సంఖ్యా తక్కువేం లేదు. అసలిలా ప్రాంతీయ పోటీలకు హాజరు కానవసరం లేకుండా నేరుగా ముంబై ఇంటర్వ్యూలకు ఎంపిక అవడం అనేది కూడా సిటీ అమ్మాయిలకు కొత్తే. మరి మనం పంపుతున్న మిస్ ఇండియా కంటెస్టెంట్స్ ఎవరు? వీరి గత విజయాలేమిటంటే...

 ‘సిటీబ్యూటీ’లకు రెడ్ కార్పెట్...
నగరం నుంచి నేరుగా ముంబై సెలక్షన్స్‌కి పిలుపు అందుకున్న వారిలో అత్యధికులు మిస్ హైదరాబాద్ కిరీటధారులే. అందులో మొదట చెప్పుకోవాల్సింది... తొలి మిస్ సిటీ బ్యూటీగా నిలిచిన నిఖితా నారాయణ్. ఈ సుందరి 2009లో తొలిసారి మిస్ హైదరాబాద్ విజేత గా నిలిచింది. ప్రస్తుతం సినీ హీరోయిన్‌గానూ రాణిస్తోంది. ఈమె డెరైక్ట్‌గా ముంబై ఆడిషన్స్‌కు హాజరుకానుంది. అదే క్రమంలో ప్రస్తుతం సినీనటిగా ఉన్న, 2010 రన్నరప్ రీతూవర్మ కూడా ప్రాంతీయ సెలక్షన్స్‌తో పనిలేకుండా ముంబై ఫ్లయిట్ ఎక్కనుంది. ఇక 2011 టైటిల్ విజేత అనుష్కా షా కూడా అవకాశం దక్కించుకుంది.

ఈమె సిటీ అమ్మాయే అయినా ప్రస్తుతం ముంబైలో ఉంటూ ‘లా’ చదువుతోంది. అడపాదడపా మోడలింగ్ చే స్తోంది. తద్వారా మిస్ ఇండియా పోటీల్లో ముంబై ఆడిషన్స్‌కు డెరైక్ట్‌గా హాజరయ్యే అవకాశం ఆమెను సులభంగానే వరించింది. ఆమెతో సిటీ టైటిల్ కోసం పోటీపడి రన్నరప్ స్థానంతో సరిపుచ్చుకున్న అషిశా మిశ్రా కూడా ఈ విషయంలో సక్సెస్ అయింది. ఇంకా ఈ జాబితాలో 2012 టైటిల్ విన్నర్ పంచమీరావ్ నాగరాజ్ కూడా ఉంది. ప్రస్తుతం నిఫ్ట్‌లో డిజైనింగ్ కోర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మాయి సరిపడా అర్హతలతో సిటీ ఆడిషన్స్‌కు హాజరయ్యే అవసరాన్ని సక్సెస్‌ఫుల్‌గా తప్పించుకుంది.
 
మేమూ రెడీ...
ఈసారి హైదరాబాద్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలోనే మిస్ హైదరాబాద్ పోటీలకు సై అన్నారు. 2012లో జరిగిన మిస్ హైదరాబాద్ పోటీల్లో టాప్ 5లో నిలిచిన అలిస్.. సిటీలో ఆదివారం జరిగిన ఆడిషన్స్‌కు పిలుపందుకున్నారు. ప్రస్తుతం సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో ఫైనలియర్ చదువుతున్న ఈ అమ్మాయి.. అప్లికేషన్స్ వగైరా ఏమీ లేకుండా తన గత విజయాల ఆధారంగానే ఈ చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం విల్లా మేరీ కాలే జ్ విద్యార్థిని, గతేడాది మిస్ హైదరాబాద్ పోటీల్లో టాప్ 5లో స్థానం దక్కించుకున్న కృతికా సింగ్ రాథోర్ కూడా డెరైక్ట్ ఎంట్రీ సాధించింది. ఇంజనీరింగ్ చదువుతూ, గతేడాది టాప్ 10లో నిలిచిన జయావిశ్వనాథన్ సైతం కుమారి భారతదేశం పోటీల ప్రత్యక్ష ఆడిషన్స్‌కు సెలక్టయింది.
 
సిటీకి ఇంపార్టెన్స్ పెరిగింది..
మిస్ ఇండియా చరిత్ర చూస్తే తక్కువ సంఖ్యలోనే హైదరాబాద్ అమ్మాయిలు కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. వారిలో నలుగురైదుగురు మాత్రమే టాప్ 10లో నిలిస్తే.. ఒకరిద్దరే టైటిల్స్ గెలుచుకోగలిగారు. కొన్నేళ్లుగా మనం కంటిన్యూగా సిటీ స్థాయిలో కాంటెస్ట్‌లు నిర్వహిస్తుండడంతో పరిస్థితి మారింది. అందుకు నిదర్శనమే సిటీ అమ్మాయిలకి డెరైక్ట్ ముంబైఆడిషన్స్ ఎంట్రీ అవకాశాలు. అంతేకాకుండా ఈ సారి నగరానికి చెందిన వారిని కూడా మిస్ ఇండియా పోటీల నిర్వహణలో భాగస్వాములుగా కలుపుకోవడం కూడా సిటీ కి పెరిగిన ఇంపార్టెన్స్‌కు ఉదాహరణ.
 - శ్రీనివాస్, పేజ్ త్రీ ఈవెంట్స్ (మిస్ హైదరాబాద్ పోటీ నిర్వాహకులు)

మరిన్ని వార్తలు