‘స్థానిక’కు అధికారాలివ్వాలి

21 Dec, 2016 02:52 IST|Sakshi
‘స్థానిక’కు అధికారాలివ్వాలి

జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఏమాజీ
27న సర్పంచుల ఐక్యవేదిక మహాధర్నాకు మా మద్దతు
ప్రభుత్వ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా నిధులు, అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయించకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేస్తున్నా యని జెడ్పీటీసీల ఫోరం ఆరోపించింది. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలపై సర్పం చుల ఐక్యవేదిక 27న చేపట్టిన మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పాలన సజావుగా జరగాలంటే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని పలు కమిషన్లు ప్రభుత్వానికి సిఫార్సులు చేశాయని, ఆయా సిఫారసులను ప్రభు త్వాలు అమలు చేయడం లేదన్నారు.

కేరళ తరహాలో రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధులను స్థానిక సంస్థలకు కేటాయిస్తానన్న సీఎం ఒక్క నయాపైసా కూడా కేటాయించలేదన్నారు. కేరళ రాష్ట్రాన్ని సంద ర్శించి ఆ తరహా పాల నను రాష్ట్రంలో అందిస్తామన్న పంచాయతీ రాజ్‌శాఖ మాజీ, తాజా మంత్రులు తమ హామీలను నిలబెట్టుకోలేదన్నారు. సర్పం చుల ఐక్యవేదిక నిర్వహించే ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలంతా హాజరై విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించకపోవడం రాజ్యాం గ స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

అనివార్య కారణాలతో ప్రెస్‌మీట్‌కు హాజరు కాలేకపోయిన ఆయన ఫోన్ ద్వారా మాట్లా డారు. సర్పంచుల ఐక్యవేదిక పోరాటానికి జేఏసీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని చెప్పారు. సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్‌ కృష్ణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రంలో రాచరిక పాలనను సాగిస్తోందని ఆరోపించారు. జెడ్పీ టీసీల ఫోరం గౌరవాధ్యక్షుడు ఏనుగు జంగా రెడ్డి, ఉపాధ్యక్షులు అంజయ్య యాదవ్, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు