ఉద్రికత్తలకు దారి తీస్తున్న భవనాల కూల్చివేత

11 Jul, 2013 15:36 IST|Sakshi

హైదరాబాద్ : పాత భవనాల కూల్చివేత హైదరాబాద్ లో ఉద్రిక్తతలకు దారితీస్తొంది. శివారు ప్రాంతం అత్తాపూర్ లో పాత భవనాలను గ్రేటర్ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేస్తున్నారు. తమకు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే భవనాలను కూల్చివేస్తున్నారని స్థానికులు గురువారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సాయంతో అధికారులు భవనాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల చర్యలను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

తొలుత జీహెచ్‌ఎంసీ ఆధీనంలోని పురాతన భవనాలను కూల్చివేసిన తర్వాత ప్రైవేటు శిథిల భవనాలను నేలమట్టం చేయాలని భావిస్తున్నారు.  సికింద్రాబాద్ ప్రాంతంలో గుర్తించిన పురాతన భవనాలు రెండొందల వరకున్నా తొలుత అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన 50 భవనాలను కూల్చియాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు