విద్యాశాఖాధికారులపై భగ్గుమన్న పీఏసీ

23 Jun, 2016 01:55 IST|Sakshi
విద్యాశాఖాధికారులపై భగ్గుమన్న పీఏసీ

అధికారుల తీరుపై సీఎస్‌కు వివరించిన చైర్మన్ బుగ్గన
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ అధికారుల తీరుపై ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖపై కంప్ట్రోలర్, ఆడిటర్ జన రల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు వివరణ ఇవ్వకుండా, సాంకేతిక విద్యాశాఖ తమ పరిధిలోకి రాదని చెప్పడంతో కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల తీరును కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ దృష్టికి తీసుకొచ్చారు. పీఏసీ ప్రాధాన్యాన్ని వివరించారు.

వెంటనే ఆయన స్పందించారు. సచివాలయం నుంచి హుటాహుటిన అసెంబ్లీకి వచ్చిన ఆయన పీఏసీ ముందు హాజర య్యారు. అసెంబ్లీ కమిటీ సమవేశాలకు అధికారులు తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటానని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ తాము ఉన్నత విద్యపై కాగ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సమీక్షించాలని భావించామని, ఆ శాఖ అధికారులు ఒక్క సాంకేతికశాఖ తమ పరిధిలోకి రాదనే ఉద్దేశంతో గైర్హాజరయ్యారని తె లిపారు.

మరిన్ని వార్తలు