పేపర్‌ గణపతికి ‘రికార్డు’ గుర్తింపు

12 Sep, 2016 23:59 IST|Sakshi
పేపర్‌ గణపతికి ‘రికార్డు’ గుర్తింపు

యాకుత్‌పురా: పర్యావరణ  పరిరక్షణలో భాగంగా పేపర్‌తో చేసిన వినాయకుడిని నెలకొల్పిన పాతబస్తీ గౌలిపురా అంబికానగర్‌ ప్రాంతానికి చెందిన ఎంబీఏ విద్యార్థి ఆర్‌.చంద్రకాంత్‌ చారికి లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఇతడు మూడేళ్లుగా పేపర్‌ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ స్థానికంగా గుర్తింపు పొందాడు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 20 కిలోల న్యూస్‌ పేపర్లు, గోధుమ పిండి, వెదురు బొంగులతో 8.4 అడుగుల విగ్రహాన్ని రూపొందించాడు. సోమవారం రాత్రి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ఇండియా ప్రతినిధులు బింగి నరేందర్‌ గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్‌ గుర్రం స్వర్ణశ్రీ.. చంద్రకాంత్‌కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు.

మరిన్ని వార్తలు