'ఉచిత యిసుక పేరుతో వందల కోట్ల లూటీ'

4 Apr, 2016 16:16 IST|Sakshi
'ఉచిత యిసుక పేరుతో వందల కోట్ల లూటీ'

హైదరాబాద్: ఉచిత యిసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయాలు లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా ఉచిత యిసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీల అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్డీఎఫ్ ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని ఆక్షేపించారు.

ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించడానికి సీఎంకు అధికారం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదన్నారు. విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులు నిలుపుదల చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు