జిల్లాల విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

4 Sep, 2016 02:26 IST|Sakshi
జిల్లాల విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు. జిల్లాల పెంపు అశాస్త్రీయంగా ఉందని అన్నారు. 10 జిల్లాల తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఒకటి రెండు జిల్లాల కోసం దీక్ష చేయడం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ఠ అని అన్నారు. రాష్ట్రాల మధ్య చిచ్చు ఆరకముందే సీఎం కేసీఆర్ జిల్లాల మధ్య చిచ్చు రగిల్చారని అన్నారు. 27 నెలలుగా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని వాపోయారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు