జీహెచ్‌ఎంసీకి కలిసొచ్చింది..

12 Nov, 2016 08:58 IST|Sakshi
జీహెచ్‌ఎంసీకి కలిసొచ్చింది..

పాత నోట్లతో బిల్లుల చెల్లింపులు
ఒక్కరోజే రూ.50 కోట్ల ఆదాయం
ఈ నెల 14 వరకు అవకాశం...

సిటీబ్యూరో : పాత పెద్దనోట్ల రద్దు పథకం ఎవరికెలా ఉన్నా జీహెచ్‌ఎంసీకి మాత్రం ఆయాచిత వరంగా మారింది. అసలే ఖజానా లోటుతో సిబ్బంది జీతభత్యాలకు సైతం అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీకి శుక్రవారం ఒక్కరోజే  దాదాపు రూ.50 కోట్లు ఖజానాకు చేరారుు. దీంతో వచ్చేనెల జీతాల చెల్లింపులకు పెద్దగా ఇబ్బంది ఉండదని  జీహెచ్‌ఎంసీ వర్గాలు  ఊపిరి పీల్చుకున్నారుు.  గత కొంతకాలంగా  వివిధ కారణాలతో జీహెచ్‌ఎంసీ ఆర్థిక ఇబ్బందుల్లో  పడటం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి జీతాల చెల్లింపుల సమయానికి ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఈనెల గడిస్తే.. డిసెంబర్ ఒకటోతేదీ నాటికి జీతాలు ఎలా చెల్లించాలా అని ఆందోళనలో ఉన్న ఉన్నతాధికారులకు పెద్దనోట్ల రద్దును పురస్కరించుకొని స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఫీజులకు పాతనోట్లు అనుమతించే అవకాశం ఇవ్వడం కొత్త ఆశలు రేకెత్తించింది. వారు ఊహించినట్లుగా శుక్రవారం ఒక్కరోజే  రూ. 100 కోట్లు రాకపోరుునప్పటికీ భారీ మొత్తమే ఖజానాకు చేరింది. ఇక దినవారీ ఆదాయం ఎలాగూ రానుండటంతో వచ్చేనెల జీతాలకు  ఇబ్బందులుండవని అధికారులు లెక్కలు వేస్తున్నారు.