'నవయుగ సంస్థ ఎవరిదో వాళ్లకు బాగా తెలుసు'

21 May, 2016 13:41 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులను నవయుగ సంస్థ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... నవయుగ సంస్థ ఎవరిదో టీడీపీ వాళ్లకు బాగా తెలుసన్నారు. చంద్రబాబు కూడా వాళ్ల హెలికాప్టర్లలోనే తిరుగుతారని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్ట్ పనుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాంట్రాక్ట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు సూచించారు. తాము రెండు ఎకరాలను 2వేల కోట్లు చేసుకోలేదని, వ్యాపారలు చేసుకోకుండా రాజకీయాల మీద సంపాదించడం తమకు తెలియదని అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా రోడ్డు పనులు చేస్తున్నామని, వేర్వేరు దేశాలలో కూడా కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతే తప్ప మీలా ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాల్లో కొనసాగడం లేదని టీడీపీ నేతలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు