-

కాల ‘చక్రం’ గిర్రున తిరిగింది...

15 Aug, 2016 03:20 IST|Sakshi
కాల ‘చక్రం’ గిర్రున తిరిగింది...

మండీ రేపు ఊరెళదాం,అని పెళ్లాం’ అంటే బస్సా? రైలా? కార్లో వెళదామా అని ఆలోచిస్తాం. కానీ అప్పట్లో కాశీకి పోవాలన్నా మనోళ్లు నడిచే వెళ్లేవారు! అమ్మో అంత దూరం.. అదీ నడిచా? అని మనం ఇప్పుడు నోరెళ్లబెట్టొచ్చేమోగాని.. అప్పట్లో విమానాలు, రైళ్లు, కార్లు సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. చాలా మంది దగ్గర సైకిళ్లు ఉంటే.. కొంత మంది దగ్గర గుర్రపు బగ్గీలు, ఎద్దుల బళ్లు, మోటార్ సైకిళ్లు ఉండేవి. బాగా ధనవంతులు మాత్రమే కార్లలో, రైళ్లలో తిరిగేవారు. ఇక విమానాలంటే మామూలు మాట కాదు!!
 
నిజానికి అప్పట్లో కొందరు కారు ఉన్నా కూడా ఎక్కువ దూరం పోవాలంటే నడిచే వెళ్లేవారు. కారణంపెట్రోలు ఇప్పటిలా ఎక్కడబడితే అక్కడ దొరికేది కాదు! అయితే దేశం మొత్తాన్నీ కాలినడకనే చుట్టివచ్చిన వారూ ఉన్నారు.
 
నడక తర్వాత అందరూ ఎక్కువగా ఉపయోగించేది సైకిలే! ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా సైకిల్‌కు లెసైన్స్ లేకపోవచ్చేమోగాని.. అప్పట్లో సైకిల్‌కు  లెసైన్సు ఉండేదని, అలాగే సైకిల్‌కు లైటు లేకపోతే పోలీసులు ఫైన్ వేసేవారని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు మరి!
 
అప్పట్లో సైకిల్ సామాన్యుడి వాహనమైతే.. ఇప్పుడు శ్రీమంతుడి వాహనం కూడా! అదే కొత్త ఛేంజ్! ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవడమో, సైకిల్ తొక్కడమో చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటే అందరూ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ‘చక్రాల్లోకి’ వెళ్లక తప్పడం లేదు.
 
ఇక స్కూటర్ల విషయానికొస్తే అప్పట్లో బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటివి ప్రధానంగా అందుబాటులో ఉండేవి.     
 
ఇక తాజాగా వచ్చిన బ్యాలెన్సింగ్ స్కూటర్ చూశారా? జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రెండు చక్రాల బుల్లి వాహనంపై తిరుగుతూ ఉన్నాడే అదే! ఇలాంటిదొకటి వస్తుందని అప్పుడు ఎవరూ ఊహించి కూడా ఉండరు!!

మరిన్ని వార్తలు