సండే సందడి కరువు..!

12 Dec, 2016 14:53 IST|Sakshi
సండే సందడి కరువు..!

చేతిలో నగదు లేక జనం విలవిల
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా జీతం చేతికి అందాక వచ్చే ఆదివారం చిరుద్యోగులకు పండుగే.. మటనో, చికెనో లేదా ఏదైనా ప్రత్యేక వంటకాల తోనో ఓ విందులాగా గడుపుతారు.. సాయంకా లం భార్యాపిల్లలతో సినిమాకో, షికారుకో వెళతా రు.. కానీ ఈ నెల తొలి ఆదివారం మాత్రం సామా న్యులందరికీ తీవ్ర నిరుత్సాహాన్నే మిగిల్చింది. కారణం చేతిలో డబ్బులు లేకపోవడమే! బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవ డంతో రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చిరుద్యోగులు, నెల నెలా డబ్బులు చేతికందే వివిధ రంగాల వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెలవు రోజైనా కూడా ఇళ్లకే పరిమితమైపోయారు. కొందరు ‘సెలవు రోజు’కే విశ్రాంతి ప్రకటించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నగదు కోసం ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు.

వ్యాపారాలన్నీ బంద్..
గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు, దుకాణాల్లో అమ్మకాలు 50 శాతానికిపైగా పడిపోయినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్‌లోని బేగంబజార్, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, అబిడ్‌‌స, కోఠి తదితర ప్రధాన మార్కెట్లలోనూ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. సాధా రణంగా నగరంలో వీధి వ్యాపారాలు అత్యధికంగా జరుగుతుంటాయి. కానీ నోట్ల రద్దు, చిల్లర కష్టా లతో అవన్నీ బాగా దెబ్బతిన్నాయి. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ గార్డెన్‌‌స, ఐమ్యాక్స్, జూపార్క్ తదితర వినోద, పర్యాటక స్థలాలకు రద్దీ బాగా తగ్గిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఏటీఎం.. ఏ వేళలో చూసినా బంద్
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏటీఎంలు ఆదివారం కూడా ఖాళీగానే వెక్కిరించారుు. హైదరాబాద్‌లోని ఏడువేల ఏటీఎంలలో రెండు వేలు కూడా పనిచేయలేదు. అందులోనూ ఎక్కడ చూసినా కిలోమీటర్ల పొడవునా జనం బారులు తీరారు. దాంతో నగదు నింపిన ఒకటి రెండు గంటల్లోనే ఖాళీ అయిపోయాయి.
 
ఫంక్షన్ హాల్ నుంచి గుడికి..
నోట్ల రద్దు, నగదు కొరతతో ఏకంగా ఓ పెళ్లి వేదికే మారిపోయింది. పెద్ద ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరగాల్సిన వివాహం.. ఓ గుడిలో నిరాడంబరంగా చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని అబిడ్‌‌స కట్టెలమండి ప్రాంతానికి చెందిన నంబి మహేందర్ పెద్ద కుమార్తె పావని వివాహం ఆదివారం (4వ తేదీన) జరిగింది. ఈ వివాహం కోసం తొలుత మెహిదీపట్నంలోని రూబీ గార్డెన్‌‌స ఫంక్షన్‌హాల్‌ను బుక్ చేసుకున్నారు. కానీ కరెన్సీ కష్టాలతో ఏర్పాట్లలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అదే ముహూర్తానికి ఎంజే మార్కెట్‌రోడ్‌లోని కాశీ విశ్వనాథుని ఆలయంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు.
 
మహిళను బలి తీసుకున్న నోట్ల కొరత
దోమకొండ: నోట్ల సమస్య కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేటకు చెందిన పులబోయిన లక్ష్మి (32) అనే మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. లక్ష్మి(32)కి గ్రామంలోని సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది. రెండు నెలల క్రితం ఆమెకు గుండె ఆపరేషన్ జరిగింది. మందుల కోసం డబ్బులు డ్రా చేసుకునేందుకు శుక్రవారం ఆమె బ్యాంకుకు వెళ్లగా.. సిబ్బంది రూ.2 వేలే ఇచ్చారు. మరికొంత సొమ్ము ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో శనివారం కూడా బ్యాంకుకు వెళ్లిన ఆమె... క్యూలైన్లోనే అస్వస్థతకు గురైంది. స్థానికంగా చికిత్స చేయించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండ డంతో లక్ష్మిని హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. లక్ష్మి భర్త నర్సింహులు ఉపాధి కోసం 3 నెలల క్రితం దుబాయి వెళ్లాడు. వారికిద్దరు కుమార్తెలు. పేదలు కావడంతో అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో.. స్థానికులే ఆర్థిక సాయం అందించారు.
 
వ్యాపారం పడిపోయింది
నోట్ల సమస్యతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. నవం బర్ 8కి ముందు ఆది వారం వచ్చిందంటే చాలు.. ఉదయం నుంచే వినియోగదారుల రద్దీ ఉండేది. కానీ ఈ ఆదివారం వ్యాపారం సగానికి తగ్గింది. వచ్చిన వినియోగదారుల్లో కొందరు రూ.2 వేల నోట్లు తీసుకురావడంతో చిల్లర ఇవ్వలేక తిప్పి పంపేయాల్సి వచ్చింది..  - సంతోష్‌కుమార్, చికెన్ వ్యాపారి, ఉప్పుగూడ

నగదు పరిమితితో అవస్థలు
నగదు ఉపసంహరణ పరిమితులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూపార్క్‌లోని జంతువులకు ఆహరం కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేవు. మాంసాహార జంతువుల కోసం మాంసం సరఫరా చేయడం కష్టంగా ఉంది.. - ఫరీద్, ఆహార సరఫరా కాంట్రాక్టర్, జూపార్క్

>
మరిన్ని వార్తలు