బస్‌షెల్టర్లు కోరుతూ హైకోర్టులో పిటిషన్

27 Apr, 2016 13:43 IST|Sakshi

హైదరాబాద్: మండే ఎండల్లో బస్ షెల్టర్లు లేక సిటీ బస్సుల కోసం నగరవాసులు పడుతున్న ఇబ్బందులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు సోమరాజు బుధవారం దీన్ని దాఖలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అమీర్‌పేట, పంజాగుట్ట, నిమ్స్ స్టేజీలలో షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. బస్ షెల్టర్ల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
 

మరిన్ని వార్తలు