25 నుంచి ఓయూ పీజీ తరగతులు

10 Jul, 2016 15:55 IST|Sakshi

ఓయూ పరిధిలో ఈ నెల 25 నుంచి వివిధ పీజీ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 14 నుంచి జరిగే సర్టీఫిక్కెట్ల వెరిఫికేషన్‌లో మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో అడ్మిట్ కార్డునును అందచేయాలి.

 

ఇదిలా ఉండగా ఓయూసెట్-2016 కౌన్సెలింగ్‌లో భాగంగా వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు పొందిన 16 వేల మంది విద్యార్థుల మొదటి జాబితాను ప్రకటించారు. సీట్లు లభించిన విద్యార్థులు ఈ నెల 14 నుంచి 20 వరకు ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టీఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. ఈ ఏడాది ఆదాయం సర్టీఫిక్కెట్ గల అభ్యర్థులు రూ.700 ఫీజును, సర్టీఫిక్కెట్లు లేని అభ్యర్థులు పూర్తి ఫీజును చెల్లించాలని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు, ఒరిజినల్ టీసీతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంటతెచ్చుకోవాలన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

 

మరిన్ని వార్తలు