శేరిలింగంపల్లిలో పోలీసులు తనిఖీలు

3 Aug, 2014 08:21 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డికాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాలనీలో దొంగలు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆ తనిఖీలలో  30 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్కు తరలించారు.

అదుపులోకి తీసుకున్న వారిలో ఏడుగురు పాత నేరస్థులు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో ఆ సోదాలు నిర్వహించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా