పెట్టెలోనే ఫిర్యాదులు..!

20 Jul, 2017 02:10 IST|Sakshi
పెట్టెలోనే ఫిర్యాదులు..!
ముఖ్యమంత్రికి చేరని పోలీస్‌ ఫిర్యాదులు 
 
సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీస్‌ కాన్ఫరెన్స్‌ను సీఎం కేసీఆర్‌ నిర్వహించారు. ప్రజలకు అందించాల్సిన పాలన, అవినీతి, అక్రమాల నియంత్రణ.. ప్రభుత్వ విధివిధానాలను కింది స్థాయిలో పనిచేసే సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలతో పాటు పై స్థాయిలో ఉండే ఐపీఎస్‌ అధికారులందరికీ వివరించారు. అలాగే పోలీస్‌ శాఖలో తీసుకురావాల్సిన మార్పు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సూచించాల్సిన సలహాలు, చేయాల్సిన ఫిర్యాదులు.. సీక్రెట్‌ బాక్స్‌ (సలహాల పెట్టె)లో వేయాలని ప్రకటించారు. ఆ సలహాల పెట్టెను స్వయంగా తానే పరిశీలిస్తానని, అందులో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. దీంతో 80 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 36 మంది ఇన్‌స్పెక్టర్లు పోలీస్‌ శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, జిల్లాల్లో పలువురు ఎస్పీలు చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. దీని పై నివేదిక రూపొందించి సీఎంకు ఉన్న తాధికారులు అందించాల్సి ఉంది.

సమావేశం నిర్వహించి రెండు నెలలు గడిచింది. సలహాల పెట్టెను డీజీపీ అనురాగ్‌ శర్మ ఓపెన్‌ చేసి నెలన్నర గడిచిపోయింది.  అసలు ఆ ఫిర్యాదులేంటి, వాటిలో ఉన్న అధికారుల సంగతేంటి, వారు పాల్పడుతున్న అక్రమాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పట్టించుకోలేదని కింది స్థాయి సిబ్బంది నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులపై ఓ కమిటీ వేసి సమీక్ష నిర్వహించాల్సిన అధికారులు సమయం లేదంటూ దాటవేయడం ఏంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. 
మరిన్ని వార్తలు