పాతబస్తీలో అర్ధరాత్రి నుంచి కార్డన్ సెర్చ్

5 Jan, 2017 11:13 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బుధవారం అర్థరాత్రి నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పాతబస్తీలోని 40 ప్రాంతాల్లో పోలీసులు అణువణువు సోదాలు నిర్వహించారు. ఆయుబ్‌ఖాన్ అనుచరులే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆయుబ్ ఖాన్ ప్రధాన అనుచరుడు ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు సాంబశివుడు సోదరుడు రాములు హత్యకేసులో నిందితుడు అయిన బాడర్ యూసఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాములు హత్యకేసులో ఏ17గా బాడర్ యూసఫ్ ఉన్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు