రూ.5 కోట్లు... అదే ఫైనల్

18 Mar, 2016 03:21 IST|Sakshi
రూ.5 కోట్లు... అదే ఫైనల్

తండ్రికి ఫోన్ చేసి బెదిరించిన అభయ్ కిడ్నాపర్
అంత డబ్బు లేదని వేడుకున్న బాలుడి తండ్రి
సికింద్రాబాద్ రావాలని చెప్పిన దుండగుడు

సాక్షి, సిటీబ్యూరో:  షాహినాయత్‌గంజ్ పరిధి నుంచి రాజ్‌కుమార్ కుమారుడు అభయ్‌ను బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేసిన దుండగులు అతడి తండ్రితో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడారు. రాత్రి 10.05 గంటలకు తొలి ఫోన్‌కాల్ రాగా... 11.14 గంటలకు రెండో కాల్ వచ్చింది. డబ్బు డిమాండ్ చేస్తూ కిడ్నాపర్ రెండోసారి ఫోన్ చేసినప్పుడు జరిగిన సంభాషణ రికార్డు మీడియాకు అందింది. 2.31 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియో ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో రెండుచోట్ల పాత సంభాషణలు మరోసారి వినిపించడం... స్పష్టమైన ముగింపు లేకపోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి అటు హిందీ, ఇటు ఉర్దూ సైతం స్పష్టంగా మాట్లాడలేకపోయాడు. దీన్ని బట్టి మరో వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. బాలుడి తండ్రి రాజ్ కుమార్, కిడ్నాపర్ల మధ్య సంభాషణ ఇదీ...

 తండ్రి: హలో...
కిడ్నాపర్: హలో...
తండ్రి: హాజీ... (చెప్పండి)
కి: బోలేనా దస్ కరోడ్ హోనా బోల్‌కే (రూ.పది కోట్లు కావాలని చెప్పానుగా)
తం: కిత్తా పైసే బోలే సాబ్? (ఎంత మొత్తం చెప్పారు సార్?)
కి: దస్ కరోడ్ (రూ. పది కోట్లు)
తం: ఆప్ కౌన్ బోల్‌రే భయ్యా? (మీరు ఎవరు మాట్లాడుతున్నారు భయ్యా)
కి: కిడ్నాపర్ బోల్‌రా హు (కిడ్నాపర్‌ని మాట్లాడుతున్నా)
తం: హా..! (ఆ..!)
కి: కిడ్నాపర్ బోల్ రహా హు (కిడ్నాపర్‌ని మాట్లాడుతున్నా)
తం: హమారీసే క్యా దుష్మనీ హైసాబ్? (మాతోం ఏం శత్రుత్వం ఉంది సార్?)
కి:  ---- (ఫోన్ డిస్ట్రబెన్స్ వచ్చింది)
తం: హా సాబ్... ఆవాజ్ నహీ ఆరీ ఆప్మీ ఫోన్ పే సహీ....(సార్... మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు)
కి: కిత్తే దేతే? (ఎంత ఇస్తారు?)
తం: రాత్ మే కిత్తే రహేంగే సాబ్ హమారే పాస్... దో లాఖ్, పాంచ్ లాఖ్...
పాంచ్ లాఖ్ తక్‌పడే రహతే పూరాబీ నికాల్ దియేతో ఘర్ మే... పాంచ్ లాఖ్ రహతా... ఔర్ దస్‌బీస్ తులా సోనా రహతా లేడీస్ క...
(రాత్రికి రాత్రంటే మా దగ్గర ఎంత ఉంటుంది సార్! రూ.రెండు లక్షలు.. ఐదు లక్షలు... రూ.ఐదు లక్షల వరకు ఉంటుంది. మహిళలకు సంబంధించిన పది, 20 తులాల బంగారం ఉంటుంది.)
కి:  పాంచ్ కరోడ్ లాస్ట్ (రూ.5 కోట్లు... ఇదే ఆఖరి బేరం)
తం: ఉత్తా రహేంగేనా సాబ్ ఘర్‌మే కాసే రహేంగే సాబ్ పైసే? (మా దగ్గర అంత మొత్తం ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది?)
కి:  ఘర్‌మే నహీ ఐసే ఝూటే మత్ బోలో. పాంచ్ కరోడ్. (ఇంట్లో లేవు... ఇలాంటి అబద్ధాలు చెప్పవద్దు. రూ.5 కోట్లు)
తం
: హా సాబ్ (ఏంటి సార్)
కి: పాంచ్ కరోడ్ (రూ. 5 కోట్లు)
తం: పాంచ్ కరోడ్ కిత్తో హోతే సాబ్. పాంచ్ సాత్ సూట్‌కేస్ హోతే బడేబడే. (రూ. ఐదు కోట్లంటే ఎంతో తెలుసా సార్? ఐదేడు పెద్ద పెద్ద సూట్ కేసులు కావాలి.)
కి:  జాదా బాతా నై కర్‌నా (ఎక్కువగా మాట్లాడవద్దు)
తం: పాంచ్ సాత్ లాఖ్ రుపే ఘర్‌మే నికల్ జాతే పూరే పేమెంట్. (మొత్తం కలిపి ఐదేడు లక్షలు ఉంటుంది.)
కి:  కిత్తే? (ఎంత?)
తం: పాంచ్ లాఖ్ సాత్ లాఖ్ నికల్ జాతే. దస్ బీస్ తులే సోనా నికల్ జాతా. (ఐదేడు లక్షల నగదు, పది, 20 తులాల బంగారం)
కి:  ఝూటే మత్ కరో (అబద్ధాలు ఆడద్దు)
తం: హా భయ్యా (ఏంటి భయ్యా?)
కి: ఝూటే మత్ కరో (అబద్ధాలు ఆడద్దు)
తం: మై ఝూటే మత్ కర్తుమ్‌నా భయ్యా ఝూట్ క్యూం కరూంగా మే? (నేను మీ దగ్గర అబద్ధాలు ఆడను కద భయ్యా? ఎలా ఆడగలను?)
కి:  సునో.... ఆప్ కుచ్ భీ కరో... పాంచ్ కరోడ్ లాస్ట్ అండ్  ఫైనల్... ఆప్ కో హోనా హైతో ఆప్‌కే బచ్చేసే పూఛో... కౌసే దేఖ్ రహాహూ.. ఆనేకే బాద్ పూంఛో....  (వినండి.. మీరే ఏమైనా చేయండి. ఐదు కోట్లు ఫైనల్. కావాలంటే మీ అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎలా చూసుకున్నానో అడగండి.)
తం: మై నాంపల్లి తక్ ఆయాహు (నేను నాంపల్లి వరకు వచ్చాను)
కి: సునో... సునో పాంచ్ కరోడ్ లాస్ట్ అండ్ ఫైనల్ (వినండి. ఐదు కోట్లే ఆఖరి మాట)
తం:భయ్యా మై ఆప్‌కో హాత్ జోడ్‌తాహు... ఇత్తే పైసే కైసే ఆతే ఆపీ బతానే మేరేకో...
(భయ్యా మీకు చేతులెత్తి దండం పెడతా.. అంత డబ్బు ఎలా వస్తుందో మీరే చెప్పండి)
కి:  బోల్‌దేతుం సున్‌లేలో... ఆప్‌కా బచ్చా కల్ సుబే ఛే బజే ఆజాతే. (చెప్తున్నాను వినండి... మీ అబ్బాయి రేపు (గురువారం) ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తాడు)
తం: హా సాబ్ (చెప్పండి సార్)
కి:  కల్ సుబే ఛే బజే ఆజాతే.. ఆనేకా బాద్ పూచో కైసే దేఖ్హ్రాహూ (రేపు ఉదయం ఆరు కల్లా వచ్చేస్తాడు. వచ్చాక అడగండి ఎలా చూసుకున్నానో)
తం: మై కైసే ఆనా ఆప్‌కే పాస్? (మీ దగ్గరకు నేను ఎలా రావాలి?)
కి:  సికింద్రాబాద్ ఆజావో (సికింద్రాబాద్‌కు వచ్చెయ్)
తం: ఆప్ అబిడ్స్ తన్ నై ఆసక్తే.. అబిడ్స్ తక్... (మీరు ఆబిడ్స్ వరకు రాలేరా?)
కి:  నై ఆసక్తే... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనా. (రాలేను... మీరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలి)
తం: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనా? (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలా?)
- ఆడియో ఇక్కడితో ఆగిపోయింది.

>
మరిన్ని వార్తలు