ఐటీ పాలసీ ఆవిష్కరణ నేడే

4 Apr, 2016 00:53 IST|Sakshi

హెచ్‌ఐసీసీలో ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
 
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం రూపొందించిన ఐటీ పాలసీని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి తదితర ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్నం 3గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్, ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ ఘోష్, సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ రాంరెడ్డి, మైక్రోసాఫ్ట్ ఎండీ భాస్కర్ ప్రామాణిక్, ఎల క్ట్రానిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో మహాపాత్ర, శ్యాంసంగ్ వైస్‌చైర్మన్ దీపక్ భరద్వాజ, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తదితరులు హాజరుకానున్నారు.

ఇదే వేదికపై ఐటీకి అనుబంధ ంగా మరో మరో నాలుగు పాలసీలను ప్రముఖులు ఆవిష్కరించనున్నారు. స్టార్టప్స్‌కు చేయూత ఇచ్చే విధంగా ఇన్నోవేషన్ పాలసీ, ఐటీ సెక్టార్‌ను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేలా రూరల్ టెక్నాలజీ పాలసీ, రాష్ట్రంలో హార్డ్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎల క్ట్రానిక్స్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీలను ప్రభుత ్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. పాలసీల ఆవిష్కరణలతో పాటు ఆయా రంగాల్లోని దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం, టి-హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్) అవగాహన ఒప్పందాల(ఎంవోయూ)ను కుదుర్చుకోనున్నాయి.

మరిన్ని వార్తలు