పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ విడుదల

22 Apr, 2017 11:36 IST|Sakshi
పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ విడుదల

హైదరాబాద్‌: ఎట్టకేలకు ఏపీ పోలీసులు దిగొచ్చారు. పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్‌(35)ను విడిచిపెట్టారు. గురువారం తెల్లవారుజామున సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తన నివాసంలో ఉన్న రవికిరణ్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

అరెస్ట్‌ చేసిన అనంతనరం పోలీసులు నేరుగా మందడం ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారని రవికిరణ్‌ వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ప్రాతంలో ఆటోలో తీసుకెళ్లారని అనంతరం వేరువేరు వాహనాలు మారుస్తూ.. 3 గంటల పాటు సీఎం క్యాంప్‌ ఆఫీసు సమీపంలో అటూ ఇటూ తిప్పారని తెలిపారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి విచారించారని రవికిరణ్ వెల్లడించారు.'పొలిటికల్‌ పోస్టింగ్‌ల వెనుక ఎవరున్నారు? సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడితే డబ్బులు ఇస్తారా? అని పోలీసులు ప్రశ్నించారని తెలిపారు. తాను పెట్టే పోస్టింగ్‌లకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి లింక్‌పెట్టి ప్రశ్నలు వేశారని రవికిరణ్‌ వెల్లడించారు.

అయితే పొలిటికల్‌ పంచ్‌ పోస్టింగ్‌లకు తనదే బాధ్యత అని పోలీసులతో పదేపదే చెప్పానని రవికిరణ్‌ అన్నారు. అందులోని ప్రతిపోస్టింగ్‌కు బాధ్యత తనదే అని, దీని వెనుక ఎవరి ప్రమేయం లేదని పోలీసులకు వెల్లడించినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా.. 25, 26వ తేదీల్లో మళ్లీ స్టేషన్‌కు రావాలని ఆదేశించిన పోలీసులు శనివారం తెల్లవారుజామున తన ఇంటివద్ద వదిలిపెట్టారని ఆయన వెల్లడించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అభ్యంతరకరంగా వెబ్‌సైట్‌లో ప్రచారం చేస్తున్నందుకుగాను అరెస్ట్‌ చేస్తున్నామని పోలీసులు అరెస్ట్‌ సమయంలో రవికిరణ్‌ భార్యతో వెల్లడించారు. రవికిరణ్‌ అరెస్ట్‌పై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ప్రభుత్వ పనితీరు సరిగాలేదని విమర్శిస్తే అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు సబబు అని నెటిజనులు ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా