ఏడాది నుంచి రవళి వెంట పడుతున్నాడు

13 Oct, 2014 12:24 IST|Sakshi

హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళి (17) ఆస్పత్రిలో కోలుకుంటోందని అరోరా కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపాయని ఆమె చెప్పారు. గత ఏడాది నుంచి ప్రదీప్ వెంట పడుతున్నట్లు రవళి వాంగ్మూలం ఇచ్చిందని ప్రిన్సిపల్ చెప్పారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు.

కళాశాల ఎంట్రన్స్ వద్ద రవళిపై దాడి జరిగిందని, తమ సెక్యూరిటీతో పాటు విద్యార్థులు గమనించి ప్రదీప్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అతడు కంగారులో తనవద్ద ఉన్న పాయిజన్ తాగినట్లు శ్రీలత తెలిపారు. రవళి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి అని, దసరా సెలవుల అనంతరం ఆమె ఈరోజే కాలేజీకి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు అందచేసినట్లు శ్రీలత తెలిపారు. కాగా  ప్రదీప్ కొంతకాలంగా వెంటపడుతున్నట్లు రవళి చెప్పిందని ఆమె స్నేహితులు తెలిపారు. తనను ప్రేమించకపోతే భయపడుతూనే కాలేజీకి వచ్చిందన్నారు.

ఈ సంఘటనపై ఫలక్నుమా ఏసీపీ మాట్లాడుతూ గత నాలుగేళ్ల నుంచి ప్రదీప్ ...రవళి వెంట పడుతున్నట్లు తెలిపారు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమంటూ రెండేళ్ల నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో రవళి తల్లిదండ్రులు... ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు పెట్టినట్లు ఏసీపీ చెప్పారు. గత నెల 21న నిర్భయ చట్టం కింద ప్రదీప్పై కేసు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రవళి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు చెప్పారు. కాగా రవళి, ప్రదీప్.... నల్లకుంటలోని రాంనగర్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ప్రదీప్ బాలనగర్లోని  సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్లో కోర్సు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు