మిరపకాయలతో పూజలు

19 Dec, 2013 10:51 IST|Sakshi
మిరపకాయలతో పూజలు

వాలాజ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో నేటి నుంచి ఐదువేల ఎండు మిరపకాయలతో ప్రత్యంగిరాదేవి యాగ పూజలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ మురళీధరస్వామి తెలిపారు. ధన్వంతరి పదవ వార్షికోత్సవం, పీఠాధిపతి 54వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని నెల రోజులుగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ధన్వంతరి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.


 
 అందులో భాగంగా గురువారం ఉదయం నుంచి ఈనెల 25వ తేదీ వరకు ప్రత్యంగిరా దేవికి అభిషేకం చేసిన ఎండుమిరపకాయలతో పాటు భక్తులు సమర్పించిన సుమారు ఐదు వేల కిలోల ఎండు మిర్చితో ప్రత్యేక యాగ పూజలు నిర్వహిస్తారన్నారు. ఈ యాగ పూజల్లో బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ, బాలమురగన్ అడిమై స్వాములు, కలవై సచ్చిదానం స్వాములతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. భక్తులకు ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రత్యేక ధన్వంతరి ప్రసాదాలను అందజేయనున్నట్లు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా