రెండు వారాల పాటు నగరంలో రాష్ట్రపతి

16 Dec, 2015 09:36 IST|Sakshi
రెండు వారాల పాటు నగరంలో రాష్ట్రపతి

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నారు. రెండు వారాల పాటు (ఈ నెల 31 వరకు) బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన విడిది చేస్తారు.


రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూల్:
ఈ నెల18న హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా రాష్ట్రపతి నిలయానికి ప్రణబ్ ముఖర్జీ చేరుకుంటారు. 19న తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ 22న కర్ణాటకలోని బీదర్కు ప్రణబ్ వెళ్లనున్నారు. ఈ 27న ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో జరిగే ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక కాంగ్రెస్ సదస్సులో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం ఎర్రవల్లికి చేరుకుంటారు.

ఎర్రవెల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే అయుత చండీయాగంలో పాల్గొంటారు. ఈ 30న సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే విందు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ 31న ఉదయం హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. షెడ్యూల్ ప్రకటించని మిగతా రోజుల్లో రాష్ట్రపతి నిలయంలోనే ప్రణబ్ ముఖర్జీ గడపుతారని సమాచారం.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా