ఖైదీ ఆత్మహత్య

20 Jan, 2018 02:27 IST|Sakshi
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో ఘటన  చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్యం

హైదరాబాద్‌: మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంచల్‌గూడ జైలు ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా యాంకీ గ్రామానికి చెందిన కుమ్మరి సత్యం (38) కూలిపనులకోసం భార్యతో కలసి కొన్నేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణెకు వలస వెళ్లాడు. ఇంటిగొడవల కారణంగా భార్యను హత్య చేసిన కేసులో పుణె కోర్టు 2017లో అతడికి జీవితఖైదు విధించింది. అప్పట్నుంచి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కొంతకాలంగా అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు.

ఈ నెల 9న అతడిని ఆస్పత్రిలో చేర్పించగా శుక్రవారం ఉదయం 12.30 గంటల సమయంలో బాత్‌రూమ్‌లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సిబ్బంది నుంచి ఈ సమాచారం అందుకున్న ఆస్పత్రి ఆర్‌ఎంఓ మోహన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పంచనామా తర్వాత మృతదేహాన్ని జైలు అధికారులకు అప్పగిస్తామని ఎస్సై మహేందర్‌ చెప్పారు.  

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా