ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

7 Aug, 2013 02:58 IST|Sakshi
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరిగాయి. వివిధ ప్రజా, ఉద్యోగ, విద్యార్థి సం ఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖులు పాల్గొని జయశంకర్‌కు నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. 
 
 సీమాంధ్రులకు పూర్తి రక్షణ 
 సరూర్‌నగర్: భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, స్వేచ్ఛా స్వాతంత్య్ర హక్కులు కల్పించిందని... ఈ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల కు అన్ని విధాలా రక్షణ ఉంటుందని తెల ంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. నాదర్‌గుల్ ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థు లు, అధ్యాపక బృందం మంగళవారం జయశంకర్ జయంతి నిర్వహించారు. ఇందులో కోదండరామ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన తొలి వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. 
 
 ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే 
 కుషాయిగూడ: రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని బీజేపీ జాతీయ నాయకులు సి.హెచ్.విద్యాసాగర్‌రావు చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య (టిఫ్) నిర్వహించిన ‘సద్భావనా సభ’ లో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... గిర్‌గ్లానీ కమిషన్ సిఫార్సులు, 610 జీఓ ప్రకారం నగరంలో అక్రమంగా ఉద్యోగాల్లో ఉన్న 1.50 లక్షల మంది తమ స్వస్థలాలకు వెళ్లాల్సిందేనన్నారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఈటెల రాజేందర్, ‘టిఫ్’ అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సీపీఐ ఫ్లోర్‌లీడర్ గుండా మల్లేష్, పీఓడ బ్ల్యు అధ్యక్షురాలు వి.సంధ్య, బీజేపీ నాయకులు ఎన్‌న్వీస్ ప్రభాకర్ పాల్గొన్నారు. జయశంకర్ సేవలను కొనియాడారు.  
 
 జీహెచ్‌ఎంసీలో... 
 సిటీబ్యూరో: తెలంగాణ మునిసిపల్ ఉ ద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పిం చారు. జీహెచ్‌ఎంసీలోని జీ హెచ్‌ఎంఈయూల ఆధ్వర్యంలో గన్‌పా ర్క్, జీహెచ్‌ఎంసీలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మునిసిపల్ జేఏసీ ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్, ఎస్టీ, ఎస్టీ విభాగం అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు