అఖిల పక్షాన్ని కలుస్తాం

19 Dec, 2016 02:45 IST|Sakshi
అఖిల పక్షాన్ని కలుస్తాం

భూ సేకరణ, ప్రైవేటు వర్సిటీ బిల్లుపై ప్రొఫెసర్‌ కోదండరాం
కరీంనగర్‌: రైతుల నుంచి భూసేకరణ, పునరావాస ప్యాకే జీ విషయంతోపాటు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో అఖిలపక్ష పార్టీల నాయకులను కలుస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. భూసేకరణలో రైతులకు అన్యాయం చేయొద్దని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తూ నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు రాజ్యామేలుతున్నాయని, ప్రైవేటీకరణ వల్ల విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు.

ఇసుక, గ్రానైట్‌ వ్యాపారాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సామా న్యుడికి ఒక ట్రాక్టర్‌ ఇసుక దొరకని పరిస్థితుల్లో టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతోందని చెప్పారు. గత ప్రభుత్వాలకు.. ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమీ లేకపోవడం విచారక రమన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు  గండిప డేందుకు కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీన మేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమి టని, పాత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త కాం ట్రాక్టర్‌కు టెండర్ల ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టును రెండింతలు అంచనాలు పెంచి ఇవ్వడం ప్రజాధనం దుర్వినియోగం చేయ డం కాదా? అని ప్రశ్నించారు. జేఏసీ, టీవీవీ ప్రజలపక్షాన నిలుస్తుందని, జేఏసీ ఎవరికి తొత్తుగా ఉండబోదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు