'పురుషులను రక్షించేందుకు కనీస చర్యలేవి'

9 May, 2015 09:43 IST|Sakshi

హైదరాబాద్ : సమాజంలో స్త్రీలు, పిల్లలు, అడవులు, జంతువులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు పురుషులను రక్షించేందుకు కనీస చర్యలు తీసుకోవటం లేదని 'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ' ట్రస్ట్ బోర్డు సభ్యులు పేర్కొన్నారు. పురుషుల రక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐపీసీ చట్టంలోని సెక్షన్ 498 (ఏ) కారణంగా భారతీయ వివాహ వ్యవస్థ భగ్నం అవుతుందని, దేశంలో 50 శాతానికి పైగా చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు.

498 ఏ చట్టం కారణంగా దేశంలో ఎంతోమంది పురుషులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటివరకూ 25లక్షల మంది జైలు పాలయ్యారన్నారు. 498 (ఏ)ను లీగల్ టెర్రరిజంగా సుప్రీంకోర్టు పేర్కొందని, పురుషులను హింసకు గురిచేస్తున్న 498 (ఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

మరిన్ని వార్తలు