బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి

7 Apr, 2018 02:41 IST|Sakshi

బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు ప్రమోష న్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శుక్ర వారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో 64 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయ కులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డారు.

బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేష న్లు అమలు చేసేందుకు చట్టపరమైన అవరోధా లు లేవని అన్నారు. మండల కమిషన్‌ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్‌లో రిజర్వేషన్ల కేసు సందర్భంగా తీర్పుని స్తూ జనాభా ప్రకారం ఉద్యోగుల సంఖ్య లేకపో తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని సిఫార్సు చేసిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎన్‌ఎస్‌ఎస్, మహిళ రిజర్వే షన్లకు లేని క్రీమీలేయర్‌ బీసీలకెందుకు విధిం చారని ప్రశ్నించారు. 56 శాతం జనాభా కలిగిన బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుల్లో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదన్నారు. గుజ్జ కృష్ణ, ముత్యం వెంకన్నగౌడ్, సుధాకర్‌ రావు, భూపేశ్‌ సాగర్, భరత్‌ కుమార్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు